VSP: కూర్మన్నపాలెం సమీపంలోని రాసాలమ్మ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న అనూష కుటుంబ కలహాల కారణంగా ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని KGHకు తరలించారు. మృతురాలు భర్త దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.