ATP: పామిడిలోని పురాతన శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో పుష్య మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ వార రుద్రాభిషేకం, పంచామృతాలు, విభూది, గంధం, బిల్వ పత్రాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. భజనల నడుమ స్వామివారిని అలంకరించి, మహా మంగళ హారతి ఇచ్చారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.