TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌లకు నోటీసులు జారీ చేసింది. ప్రభాకర్ రావును SIB ఓఎస్డీగా ఎలా నియమించారనే దానిపై సిట్ విచారణ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపై నవీన్ చంద్‌ను ఆరా తీయనున్నారు.