GDWL: వాల్మీకి ఉద్యోగులందరూ ఒకే తాటిపై ఉండి సంఘం సామాజిక అభివృద్ధికి కృషి చేయాలి అని జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం గద్వాల పట్టణంలోని వాల్మీకి భవన్లో జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంఘం ఎప్పుడూ ముందుంటుందన్నారు.