SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జీఎంఆర్ రక్ష సెక్యూరిటీ సర్వీసెస్ మేనేజర్ అగ్గాల హనుమంతరావు తెలిపారు. సెక్యూరిటీ గార్డుల నియామకానికి జరుగుతున్న ఎంపికల్లో 166 సెంటీమీటర్ల పొడవు ఉండి, పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.