SKLM: ఆమదాలవలస రామలింగేశ్వర ఆలయ పుష్కరిణిలో చిన్నారుల మృతి ఘటన పై స్థానిక ఎమ్మెల్యే రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఘటనకు గల కారణాలను ఎమ్మెల్యే ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. ఇక పై ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.