W.G: టీడీపీ జిల్లా కార్యదర్శిగా పితాని మోహన్రావు నియమితులయ్యారు. గతంలో తణుకు మండల అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనను జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆదివారం తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణను మోహన్రావు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పదవి పొందిన ఆయనను MLA అభినందించారు.