TG: గ్లోబల్ సమ్మిట్ వేదికగా రూ.లక్షల కోట్ల MOUలు కుదిరాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సమ్మిట్లో కుదిరిన MOUలను KCR చాలా తక్కువ చేస్తూ మాట్లాడరని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారనుకుంటే.. పెట్టుబడులు రావొద్దన్నట్లుగా మాట్లాడారని మండిపడ్డారు. BRS హయంలోనూ ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు రాలేవని.. దానిపై తాము రాజకీయం చేయలేదని చెప్పారు.