ASF: కెరమెరి మండలంలోని కొటాపరందోలిలో ఉన్న జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని SP నితికా పంత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా జాతర ఏర్పాట్లను, భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.