GNTR: తుళ్లూరు (M) వడ్డమానుకు గ్రామానికి సోమవారం మంత్రి నారాయణ రానున్నారు. గత వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన మంత్రిని గ్రామస్థులు రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. దీంతో ఆయన వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి ఉదయం వడ్డమాను గ్రామంలో మంత్రి రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నారు.