కడప TDP పార్లమెంటు సభ్యుడిగా నియమితులైన చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి నేడు తొలిసారిగా నియోజకవర్గానికి రానున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు పెద్దముడియం మండలం సుద్దపల్లి గ్రామం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని TDP కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ర్యాలీని విజయవంతం కావాలని పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.