KRNL: మంత్రాలయం రాఘవేంద్రస్వామి శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆదివారం తిరువనంతపురంలో పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఆశీర్వదించారు. సాంప్రదాయం ప్రకారం, స్వామిజీని పద్మనాభస్వామి జ్ఞాపికతో సన్మానించారు. పీఠాధిపతి గవర్నర్కు శేషవస్త్రం అందజేశారు.