ASR: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న అరకు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. నియోజవర్గానికి చెందిన ఆరు మండల కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా అరకులోయలో పలు సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.