PPM: గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఆమె ప్రజలకు వివరించారు. స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.