W.G: ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ భీమవరం కార్గో పాయింట్లో ‘డోర్ డెలివరీ మాసోత్సవాల’ను శనివారం ప్రారంభించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, ఇంఛార్జ్ ఎంహెచ్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రధాన పట్టణాల్లో జనవరి 19 వరకు ఈ డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.