W.G: పెంటపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది సుశీల ‘డిజిటల్ న్యాయపాలన’ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వినియోగదారులు చట్టాలపై కనీస జ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. అనంతరం వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు.