NZB: మోపాల్ మండల గ్రామపంచాయతీ పాలకవర్గం శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సర్పంచులు, వార్డ్ మెంబర్లను ఆయన అభినందించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుందని వెల్లడించారు. రాబోయే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.