TG: HYDలో ఓ డాక్టర్ వద్ద సైబర్ నేరగాళ్లు రూ.14 కోట్లు మోసం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సత్తుపల్లికి చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. నలుగురిని రిమాండ్కు తరలించినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు తెలిపారు. వారు బ్రహ్మినాయుడు, పవన్, మణిరామ్, శివకృష్ణగా పేర్కొన్నారు. అయితే వీరి పోలీస్ కస్టడీపై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.