MBNR: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో MBNR జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతలే లక్ష్యంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.