NLG: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాను నల్గొండలోని ఐటీఐ క్యాంపస్లో ఉదయం జరుగుతుందని, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి 10th, డిగ్రీ అర్హత గలవారు విచ్చేయాలని కోరారు.