TG: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక అంశాలపై చర్చించారు. గంటకు పైగా మాట్లాడిన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు తప్ప సీఎం రేవంత్ పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఇప్పటి వరకు కేసీఆర్ నోట రేవంత్ పేరు రాలేదు. మరోవైపు BRS కు బదులుగా TRS అని పాతపేరునే పలుమార్లు ప్రస్తావించారు.