తెలుగు బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలేలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇమ్మాన్యూయేల్ ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చాడు. హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి హౌస్లోకి వెళ్లి ఇమ్మూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో, అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో టైటిల్ రేసులో పవన్, కళ్యాణ్, తనూజా మాత్రమే మిగిలారు.