బిగ్‌బాస్ సీజన్-9 నుంచి డిమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు. హీరో రవితేజ రూ.15 లక్షల నగదుతో కూడిన సూట్ కేస్‌తో హౌస్‌లోకి వెళ్లి.. ఈ డబ్బు తీసుకుని ఎవరైనా రేసు నుంచి తప్పుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీనికి కళ్యాణ్, తనూజా నిరాకరించగా.. పవన్ అందుకు అంగీకరించి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన పవన్ టాప్-3 వరకు చేరుకోవడం విశేషం.