KDP: ఒంటిమిట్ట మండలం గుటికాడిపల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో మహిళ హత్యకు గురైంది. నాలుగు రోజులుగా తోటకు కాపలాగా ఉంటున్నానని చెప్పిన రాజంపేటకు చెందిన యానాది రమణ, అతని భార్య గుడిసెలో నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం గుడిసెలో రమణ భార్య తీవ్ర గాయాలతో, బట్టలు లేకుండా మృతిచెందినట్లు గుర్తించారు. నిందితుడిగా అనుమానిస్తున్న రమణ పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.