KDP: మైలవరం మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం అయినట్లు మైలవరం PHC వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో 2,803 పిల్లలకు గాను 2,050 (73.13 శాతం) పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో CHO శ్రీనివాస్, రఫీ తదితరులు పాల్గొన్నారు.