WG: గుడివాడలో నిర్వహించిన సనాతనభారతీయం నృత్యోత్సవం 2025 ప్రదర్శనలో వీరవాసరం చిన్నారులు సత్తా చాటారు. ఆదివారం నాట్యాచార్యుడు వినయ్ కృష్ణ వివరాలు వెల్లడించారు. కూచిపూడి ప్రదర్శనలో ప్రతిభ చూపి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారని తెలిపారు. విజేతలు కావ్య శ్రీనంద, దివ్యశ్రీ, లక్ష్య, డింపుల్‌కు నిర్వాహకులు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.