KNR: ఈనెల 24 నుంచి 26 వరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ “కిసాన్ గ్రామీణ మేళా” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.