PDPL: ప్రజావాణి రెండో వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రాన్ని అందుకున్న కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర రావును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా అభినందించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో తహసీల్దార్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవను కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు.