TG: వైద్య విద్యార్థులకు కేంద్రమంత్రి బండి సంజయ్ హితబోధ చేశారు. ఫార్మా కంపెనీల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని సూచించారు. వైద్యం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే.. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లా తయారవుతారని, అప్పుడు రోగులకు ‘వైకుంఠ యాత్రే’నని చమత్కరించారు. ఎంబీబీఎస్ అంటే టీ20 మ్యాచ్ కాదని.. ఐదేళ్ల టెస్ట్ మ్యాచ్ అని, కష్టపడి చదవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.