TG: హేట్ స్పీచ్ చట్టం పేరుతో హిందువుల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు మండిపడ్డారు. కర్ణాటక తరహాలో ఇక్కడ బిల్లు తెస్తే అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని, సనాతన ధర్మాన్ని తిట్టేవాళ్లకు అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. ఇక కేసీఆర్ మళ్లీ వచ్చినా లాభం లేదని, రాష్ట్రంలో బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.