WGL: నర్సంపేటలో గిరిజన గురుకుల కళాశాలలో జరిగిన సంఘటనలు HIT TV ప్రచురించగా ఇవాళ కలెక్టర్ డా. సత్య శారద పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంఘటనపై విద్యార్థులను విచారించగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించిన వారిపై చర్యలు తీసుకునేందుకు సెక్రెటరీ నివేదిక అందిస్తామని వెల్లడించారు. సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చినందుకు HIT TV యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.