SRD: సిర్గాపూర్ మండలం వాసర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద పిల్లల పరిస్థితిపై స్థానిక ఉపాధ్యాయురాలు కనికరించి ఆదుకున్నారు. తల్లికి మానసిక పరిస్థితి సరిగ్గా లేక నలుగురు ఆడపిల్లలు పరిస్థితి పూట గెలవడం కష్టంగా ఉంది. ఈ సందర్భంగా స్థానిక టీచర్ స్వరూప ఆదివారం తమ విద్యార్థుల ఇంటికి వెళ్లి వారికి నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందించారు.