NZB: ఎంతో మంది గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని. దీంట్లో భాగంగానే పథకానికి గాంధీ పేరు తొలగించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్‌లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ఉన్నారు.