WG: ఆకివీడులో లక్ష్మణ స్వామి జిల్లా పరిషత్ హైస్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. రాష్ట్రస్థాయి పాటల పోటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన ఆకివీడు వచ్చారు.