మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఈనెల 28వ తేదీన నిర్వహించబోయే మాలల చైతన్య సమితి ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేద్దామని సంఘ అధ్యక్షులు కేశవులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాలల హక్కుల సాధన కోసం మాలల సమస్యల పరిష్కారం కోసం 2015 వ సంవత్సరంలో సంఘం ఆవిర్భవించడం జరిగిందన్నారు.