NGKL: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో ఆయన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించారు.