PDPL: పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామ శివారులోని 2వే బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను ఎట్టకేలకు పూడ్చివేశారు. గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అన్నం లక్ష్మీ నారాయణ, ఉపసర్పంచ్ బండి సాగర్ కలిసి స్వంత ఖర్చులతో ఈ గుంతలను సిమెంటుతో పూడ్చివేశారు. అనేక మంది టూ వీలర్లు ఈ గుంతలలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఉపసర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.