GNTR: పేదల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ అధినేత జగన్ పాలన సాగించారని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం వెనిగండ్లలో వైఎస్సార్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులకు ఉత్సాహమిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.