విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని చెప్పారు. నగర పౌరులు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేయటం ద్వారా సత్వర పరిష్కారం పొందువచ్చని పేర్కొన్నారు.