MDK: నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం ఎస్సై రాజేష్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించే వాహనా దారులు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని కోరారు.