WG: తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు నాలుగు జిల్లాల అవసరాల కోసం ఆదివారం 2,600 టన్నుల యూరియా దిగుమతి అయిందని ఏడీఏ గంగాధర్ తెలిపారు. ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రైవేట్ డీలర్లకు 550 టన్నులు, మార్కెట్కు 300 టన్నులు కేటాయించినట్లు వివరించారు. మరో 255 టన్నుల యూరియాను ఇండియన్ పాటాష్ లిమిటెడ్ విడుదల చేసిందన్నారు.