మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ CPI కార్యదర్శిగా దాగం మల్లేష్ ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణ CPI కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా మల్లేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో CPI బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నాయకులు వెంకటస్వామి, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.