KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మాజీ ఉద్యోగి గురు ఆదివారం మృతి చెందారు. ఆయన మఠంలో ఎలక్ట్రిషియన్‌గా శాశ్వత ఉద్యోగిగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు. సేవలను గుర్తించిన మఠం యాజమాన్యం విరమణ అనంతరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఆయన మృతికి శ్రీ మఠం అధికారులు సంతాపం తెలిపారు.