VZM: వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 20న విజయనగరంలో జిల్లా స్థాయిలో వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ఆర్ధన్నపాలెం ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పి.కీర్తిక ప్రథమ స్థానంలో నిలిచి రూ5 వేలు నగదు బహుమతిగా పొందినట్లు ప్రిన్సిపాల్ జీ.ప్రసన్నలక్ష్మి ఆదివారం తెలిపారు. అలాగే విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో విజయం పొందాలని ఆకాంక్షించారు.