సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ భక్తులు ‘త్వమేవాహం’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ‘నీవు నేను ఒకటే’ అనే ప్రధానాంశంతో సాగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయి కుల్వంత్ హాల్లో జరిగిన ఈ నాటకాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.