కోనసీమ: ఆత్రేయపురం, అంబాజీపేట పీఎస్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి రూ. 35 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా అమలాపురంలో వెల్లడించారు. నిందితుడు 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచామని చెప్పారు.