W.G: భీమవరం చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాజ్యసభసభ్యుడు పాక వెంకట సత్యనారాయణ ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి అవగాహన కల్పించారు. పోలియో రహిత సమాజం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి చుక్కలు వేయించాలని MP కోరారు.