SRPT: న్యాయాన్ని కోరుకుంటూ కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం లభించే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహన్ న్యాయవాదులను కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోర్టు హాల్ నందు జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు.