HYD: మహాలక్ష్మి పథకం వల్ల RTC లాభాల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత రెండేళ్లలో RTCలో 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయన్నారు. ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్ మెస్ ఛార్జీలను 200% పెంచామన్నారు.