E.G: ధవళేశ్వరం సంజయనగర్లో ఆదివారం మూడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల బెడదతో ప్రాణభయం నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.